విద్యుత్ స్తంభాలను సరిచేయండి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో భారీ వర్షాలతో సిర్నపల్లి గ్రామంలో కరెంటు స్తంభాలు వంగి ప్రమాదం పొంచి ఉంది. వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు,లైన్మెన్ స్పందించి వెంటనే కరెంటు స్తంభాన్ని సరిచేసి ప్రమాదం జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.