జిల్లాకు ఐదుగురు తాత్కాలిక తహసీల్దార్లు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్: జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ మండలాలకు తాత్కాలిక (అడ్హాక్) పద్ధతిలో తహసీల్దార్లను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే (సర్) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈ నెల 25 నుంచి సర్ ప్రారంభం గానుంది. ఈ ప్రక్రియలో సొంత జిల్లాకు చెందిన వారు మండలాదికారుగా ఉండరాదనే నిబంధనలు ఉన్నాయి. దీనిపై దృష్టి సారించిన సీసీఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్లే ఇంచార్జి తహసీల్దార్లుగా ఉన్న నాలుగు మండలాలకు మూడు జిల్లాలకు...