Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 11:03 am Posted by : ramakrishna

పాక్ దాడుల్లో .. అధికారి సహా ఐదుగురు మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ: భారత్ – పాక్ ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈదాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పాతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ డ్రోన్లతో దాడి చేయడంతో మృతి చెందారు. రాజ్ కుమార్ జిల్లా డెవలప్ మెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజ్ కుమార్ మృతిపై సీఎం ఒమర్ అబ్దుల్లా  స్పందిస్తూ నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్ ను మనం కోల్పోయమని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Five people including an officer killed in Pakistani attacks