Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2025, 2:11 pm Posted by : ramakrishna

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

గుజరాత్ రాష్ట్రంలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.  అహ్మదాబాద్‌ లోని బగోదర లో ధోల్కా ఏరియాకు చెందిన విపుల్‌ వాఘేలా (32), సోనల్ వాఘేలా (26) ఇద్దరు దంపతులు. వీరికి కరీనా (11), మయూర్‌ (8), ప్రిన్సీ (5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. విపుల్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఆటో కోసం తీసుకున్న ఈఎంఐ లోన్ కట్టలేకపోయాడు. దీంతో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు పిల్లలకు, భార్యకు విషమిచ్చి తాను కూడా విషం సేవించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వారు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.