. . . బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ:
గడ్డపారలు, ఇనుప రాడ్లతో ఇండ్ల తాళాలు పగులు గోట్టి బీరువాలను లాకర్స్ ను బద్దలు కొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల గడ్డపార గ్యాంగ్ సభ్యుల ను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ…. గడ్డపార గ్యాంగ్ సభ్యులు గడిచిన నాలుగు నెలల్లో తాడ్వాయి, లింగంపేట్, రాజంపేట, బాన్సువాడ పరిధిలో తొమ్మిది ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకుని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సదాశివ నగర్ సిఐ సంతోష్, తాడ్వాయి, గాంధారి ఎస్ఐలు నరేష్, ఆంజనేయులు మూడు టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానికంగా చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ టివి పుటేజీ ఆధారంగా ఒక బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అధారంగా ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడినట్టు గుర్తించారు. గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన బస్సీ జోదరాజ్, అంకుష్ ప్రేమ్ సింగ్ సాబలే, బామన్ మహేంధర్( చెన్నా పూర్ తండా) లకు చెందిన వారితో పాటు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాకు చెందిన బి హిరాలాల్, నునవత్ గణేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు నగలు, 22 తులాల వెండి నగలు, ఒక బైక్, 5 మొబైల్ ఫోన్ లు రూ.8,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
