Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 12:25 pm Posted by : ramakrishna

ఆటవి అధికారులను అడ్డుకున్న ఐదుగురి అరెస్ట్

 

 ఎల్లారెడ్డి, బతుకమ్మ:

ఎల్లారెడ్డి ఆటవి రేంజ్ పరిధిలో  హాజీపూర్ లో విది నిర్వహణలో ఉన్న బీట్ ఆఫీసర్ ల విధులు అడ్డుకున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి పోలిసులు తెలిపారు. హాజీపూర్ బీట్ పరిధిలో అటవీ భూముల  ఆక్రమణల సమాచారం తెలిసి  2026 సెప్టెంబర్ 30 న బీట్ ఆఫీసర్ లు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్ లు అక్కడికి వెళ్లారు. హజీపూర్ తాండ కు చెందిన  సభావత్ దేవులా, సబావత్ దేవిసింగ్, సభావత్ గంగారం, సభావత్ గోవింద్, సభావత్ గంగారంలు విధులకు అడ్డు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు కాగా  ఈ నెల 13న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.