హున్సాలో యథావిధిగా పిడిగుద్దులాట
పోలీసుల ఆదేశాలు బేఖాతర్ బోధన్, బతుకమ్మ: తెలంగాణ లోనే ప్రత్యేకంగా ప్రతి ఏడాది హోలీ సందర్భంగా హున్సాలో నిర్వహించే పిడిగుద్దులాటను నిర్వహించవద్దను పోలీసుల ఆదేశాలను హున్సా గ్రామస్తులు బేఖాతర్ చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించొద్దని, ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆదేశించిన విషయం విధితమే. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ హోలీ సందర్భంగా ప్రతి యేటా నిర్వహించే పిడిగుద్దులాట సాంప్రదాయాన్ని కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం పిడిగుద్దులాటను నిర్వహించారు.