మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీరుగుమందు( చేపమందు) ఆదివారం పంపిణీ చేశారు. మృగశిర కార్తె పురస్కరించుకొని ఆదివారం నగరంలోని నెహ్రూ పార్కులో హమ్ దర్డ్ దవాఖానాలో ఉబ్బసం నివారణ కోసం హకీం మహమ్మద్ అహ్మద్ ప్రజలకు చేపమందు పంపిణీ చేశారు.   గత దశాబ్ద కాలంగా చేపమందు పంపిణీని వారు నిర్వహిస్తున్నారు. చేప మందు కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.