Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 12:43 pm Posted by : ramakrishna

తొలి తెలుగు గాయని రావు బాల సరస్వతి కన్నుమూత

హైదరాబాద్, బతుకమ్మ : తొలి తెలుగు గాయని రావు బాల సరస్వతి (97) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లో  తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.  ఆరేళ్ల వయస్సు నుంచే ఆమె పాడటం ప్రారంభించారు. సతీ అనసూయ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు.