సిరిసిల్లలో తొలి సాదాబైనామా కేసు ఆమోదం
సిరిసిల్ల, బతుకమ్మ : సాదాబైనామా ద్వారా జరిగిన భూ లావాదేవీల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి సాదాబైనామా కేసు ఆమోదం పొందింది. తంగళ్లపల్లి మండలంలోని తంగళ్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఈ కేసుకు ఆమోదం లభించడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సాదాబైనామా కేసులను పారదర్శకంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు భూ హక్కుల క్రమబద్ధీకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ తెలిపారు. జిల్లాలో తొలి...