ప్రశాంతంగా మొదటి విడత పోలింగ్

నిజామాబాద్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7.00 గంటలకు   ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన 78.83 శాతం పోలింగ్ నమోదైంది. తుది పోలింగ్ శాతం వివరాలను తదుపరి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.   జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట, ఎం.ఎస్.సీ ఫారంలలో, బోధన్...