కొనుగోళ్లలో ప్రథమం.. రికవరీలో అధమం

ధాన్యం కొనుగోళ్ళకు సివిల్ సప్లయ్ టార్గెట్ ఫిక్స్ రికవరీ మాత్రం రెవెన్యూ శాఖకు అప్పగింత 93 మిల్లులకు రెవెన్యూ రికవరీ యాక్టు నోటీసులు జారీ అయ్యాయా?   నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళకు పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా టార్గెట్ లను ఫిక్స్ చేసింది. ఈ సీజన్ లోనూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకే ప్రథమ స్థానం దక్కింది. జిల్లాల వారీగా విభజించినప్పటికీ నిజామాబాద్ 6,79,234 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం విధించింది. 4వ స్థానంలో కామారెడ్డి జిల్లా 4,51,528...