Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2025, 6:05 pm Posted by : ramakrishna

ఎల్బీనగర్ లోని శ్రీ శ్రీ మాల్ మైసమ్మ ఆలయంలో ఘనంగా తొలి బోనం

హైదరాబాద్, బతుకమ్మ : లష్కర్ బోనాల ఉత్సవాలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌లోని శ్రీ శ్రీ మాల్ మైసమ్మ ఆలయంలో తొలి బోనం సమర్పణ, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఫౌండర్ చైర్మన్ గుంటి లక్ష్మణ్, కార్యనిర్వహణాధికారి (ఈఓ) ప్రేమ్ కుమార్ రావు పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి.ఈ సందర్బంగా ఆలయ పూజారి రామూర్తి శర్మ మాట్లాడుతూ.తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించి, అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగు చర్యలు తీసుకున్నట్టు. తెలిపారు.