Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 4:55 pm Posted by : ramakrishna

బడా  రాంమందిరం ప్రాంతంలో ఆగ్ని ప్రమాదం

. . .  గడ్డి వాములకు మంటలు అంటుకుని ప్రమాధం

. . . ఆవులకు తప్పిన ప్రమాధం

. . . పైరింజన్ తో మంటలను ఆర్పివేత

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ లో గల బడా రాం మఠ్ ( బడా రాంమందిరం) ప్రాంతంలో ఆగ్నీ ప్రమాధం జరిగింది. స్థానికంగా మందిరంను అనుకుని ఉన్న ఆవులకు సంబందించిన ( గోశాల) లో మేత కోసం నిల్వ ఉంచిన గడ్డికి మంటలు అంటడంతో గురువారం మద్యహ్నం ఈ ప్రమాధం జరిగింది. ఈ సంధర్బంగా గడ్డి వాములు మంటలకు అహుతి అయ్యాయి.

Fire hazard in Bada Ram Mandiram area

 

స్థానికంగా 30 నుంచి 40 ఆవుల మేత కోసం ఉంచిన గడ్డికి మంటలు అంటిన సమయంలో పశువులు అక్కడే ఉండటంతో స్థానికులు అప్రమత్తమై వాటిని వదిలేశారు. దానితో ఆవులకు ఎలాంటి ప్రమాధం జరుగలేదు. స్థానికులు వేంటనే ఆగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పైరింజన్ తో మంటలను అర్పివేశారు. అగ్నీ కీలలు విస్తరించి పైరింజన్ కు నీరు సరిపడ లేకపోవడంతో అక్కడే ఉన్న బోర్ ద్వార మంటలను ఆర్పివేసేందుకు స్థానికులు సహయ సహకారాలు అందించారు. గత ఎడాధి కుడా ఓక్కసారి ఆగ్నీ ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధం షార్ట్ సర్కుట్ ద్వార జరిగిందా లేక ఎవరైన పశుగ్రాసంకు నిప్పు పెట్టారా అని సిసిటివి పుటేజిలు పరిశీలిస్తున్నారు.

 

Fire hazard in Bada Ram Mandiram area