Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:27 am Posted by : ramakrishna

కామారెడ్డి లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

 

..21 షాపులు పూర్తిగా దగ్ధం

. . . రోడ్డున పడ్డ వ్యాపారులు

 కామారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రూట్ షాపులు సహా మొత్తం 21 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లక్షల ఆస్తినష్టం సంభవించిన వ్యాపారులు రోడ్డున పడ్డారు.

 

Fire breaks out in Kamareddy at midnight

ఆదివారం ఉదయం కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఫైర్ యాక్సిడెంట్ గురించి ఆరా తీశారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని  ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా సంభవించింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్, అగ్నిమాపక శాఖ లో అగ్ని ప్రమాదం తీరుపై విచారణ చేస్తున్నారు.