నాగారం డంపింగ్ యార్డ్ లో మంటలు
నాగారం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డ్ లో అగ్ని ప్రమాదం సంభవిoచింది. శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి డంపింగ్ యార్డ్ లో మంటలు విస్తరించాయి. సమాచారం తెలిసిన మున్సిపల్ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పి వేశాయి. శనివారం ఉదయం కూడా మంటలు అర్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.