నగల దుకాణానికి నిప్పు.. తృటిలో తప్పిన ప్రమాదం

సదాశివనగర్, బతుకమ్మ : సదాశివనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే నగల దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బంజే చిన్న ప్రభులింగం తన నివాస గృహంలో నగల దుకాణం పెట్టుకోవడానికి షెడ్ ఏర్పాటు చేసి ఫర్నిచర్ పనులు నిర్వహిస్తున్నారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్న సమయంలో లోపలికి వచ్చి కిరోసిన్ పోసి  నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయానికి లోపల పనులు నిర్వహిస్తున్న వ్యక్తులు ఉండడంతో గమనించి మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ మధ్యకాలంలో మార్వాడి...