ఇందల్వాయి అటవీ అధికారులపై ఎఫ్ఐఆర్
అడవిని చదును చేయకముందే పోడు పట్టాలు స్థానికేతరులకు పోడు పట్టాలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అటవీ అధికారులపై కేసు నమోదు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అటవీ భూములు అన్యాక్రాంతమౌతున్నాయి. పోడు చేయకున్నా అటవీ అధికారులే అక్రమంగా అక్రమార్కులకు వంత పాడుతున్నారు. అటవి అధికారుల అక్రమాలపై అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకున్నా అటవీ భూముల ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ తంతు కొనసాగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, సిరికొండ, కామారెడ్డి జిల్లా...