మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లో ముగిసిన క్రషింగ్
నిజాంసాగర్, బతుకమ్మ : మండలంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లో సీజన్ క్రషింగ్ ఆదివారం తో ముగిసిందని ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రావు తెలిపారు. ఈ సీజన్ మొత్తం లో 3,65,280 మెట్రిక్ టన్నుల చెరుకును క్రషింగ్ చేసినట్లు తెలిపారు. ముగింపు సందర్భంగా పూజ కార్యక్రమాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ అధికారులతో పాటు,కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.