Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 9:11 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ కానిస్టేబుల్ కు జరిమానా

  • సౌండ్ పొల్యూషన్ బుల్లెట్ బండికి ఫైన్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా పడింది. ట్రాఫిక్ పోలీస్ బుల్లెట్ బండి శబ్ద కాలుష్యం చేయడంతో ఫైన్ కోసం చలాన్ విధించారు. సంబంధిత ఈ చాలన్ ద్వారా 1400 జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. గతంలో ట్రాఫిక్ ఏసిపి గా నారాయణ పనిచేసిన కాలంలో ఇతరుల బైకులకు సౌండ్ పొల్యూషన్ కారణమని సైలెన్సర్లను తొలగించిన అధికారులు ఎట్టకేలకు సౌండ్ పొల్యూషన్ పేరిట జరిమానా విధించడం గమనార్హం. గతంలో బుల్లెట్ బండ్ల సైలెన్సర్ లు మాడిఫై ఉంటే వాటిని తొలగించి రోడ్ రోలర్ లచే తొక్కించిన సంఘటనలు ఉండటం విశేషం.

Fine for traffic constable