Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 6:25 pm Posted by : ramakrishna

బస్సుల వివరాలు తెలుసుకోండి ఇలా..!

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుల బయలుదేరు సమయాలు, చార్జీల వివరాలు తెలుసుకోవడానికి ఇకపై బస్సు స్టాండ్ కు  వెళ్లాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ రీజియన్‌లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి బయలుదేరు బస్సుల సమయాలు, ఛార్జీల సమాచారం కోసం ప్రయాణికులు ఫోన్‌ ద్వార నే సంబంధిత డిపోలను సంప్రదించవచ్చు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సురక్షితంగా ప్రయాణించాలనీ టీజీఎస్‌ఆర్‌టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ టి.జోస్నా సూచించారు. నిజామాబాద్ – 9959226022, ఆర్మూర్ – 7382843133, బోధన్ – 9849500725, బాన్సువాడ – 9491105706,  కామారెడ్డి – 7382843747.