తోటి విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక చేయూత

  ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన 2001-02 బ్యాచ్ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి చదువుకున్న సిరసు లావణ్య భర్త ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు క్లాస్‌మెంట్స్ ముందుకు వచ్చారు. లావణ్య కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా లావణ్య కుమార్తె పేరుపై రూ.50 వేలను పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆ మొత్తానికి సంబంధించిన పత్రాలను కుటుంబ సభ్యులకు...