రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి చెందిన సిఎల్ రామసాని ఉదయ్ కు ఇటీవలే విద్యుత్ షాక్ తగిలి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఎలమంచిలి శీనివాస్ ఆదివారం వారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి, దైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 5000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.