ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన యువతరం యూత్ సభ్యులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గౌరు రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం రూపంలో ఆదివారం పదకొండు వేల రూపాయలు అందజేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌరు రమేష్ చికిత్స పొందుతున్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి పెద్ద మనసుతో మరికొందరు ఆర్థిక సాయం చేయాలని యువకులు కోరారు. ఈ కార్యక్రమంలో యువతరం యూత్ సభ్యులు తుప్ప సాయిబాబా,కమ్మరి శివ, ఎరుకల దేవేందర్, కటికల గంగాధర్, కేపీ గంగారం,కమ్మరి పెద్ద కాశిరాం, పాశం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.