బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన బాధితులు పున్న సావిత్రి ,బడే లక్మికి సంబంధించిన రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధం అయి ఆస్తి మొత్తం నష్టం జరిగింది. బాధిత కుటుంబాలకు ఆదివారం కాంగ్రెస్ నాయకులు వారి ఇంటి కెళ్ళి ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున 10,000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి సభ్యులు నారోజీ గంగారం, పీఏసిఎస్...