మెండోరా, బతుకమ్మ: స్నేహమంటే కలిసికట్టుగా ఉంటూ కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే స్నేహితులని అంటారు. కలిసి చదువుకున్న స్నేహితులందరి లోనుండి ఒక స్నేహితుడు దూరమయ్యాడు. ఈ విషయం తెలుసుకొని వారి కుటుంబానికి ఆర్థిక సాయం గా తమవంతుగా తోచిన సాయం అందించడం జరిగింది. మెండోరా మండల కేంద్రము లో ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి గాండ్లా అశోక్ (రేషన్ డీలర్) శుక్రవారం మృతి చెందాడు.వారి కుటుంబానికి పదవ తరగతి 2006 బ్యాచ్ విద్యార్థులు రూ. 55,000 ఆర్థిక సహాయాన్ని అందచేశారు.ఈ కార్యక్రమంలో ముస్కు సాయిరెడ్డి,అల్లూరి ముత్యం,చెట్పల్లి రాజ్, చింతూరి సురేష్,చెన్న ప్రవీణ్,పటేల్ ప్రవీణ్,గుంటి రాజశేఖర్, ఈర్ల ప్రవీణ్,జిల్లా నవీన్,తదితరులు పాల్గొన్నారు.