Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 5:36 pm Posted by : ramakrishna

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మాచారెడ్డి, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన తమ మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 1986-87 బ్యాచ్ క్లాస్ మేట్ వోడపల్లి నర్సింగరావు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో గత నెల 17న మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు కాగా ఒక కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు డిగ్రీ సెకండియర్ చదువుతుంది. అతని కుటుంబానికి తమ వంతు సహాయం చేద్దామని క్లాస్ మేట్స్ తలా కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు. 50 వేల రూపాయలు బ్యాంకు లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన బాండ్ ను ఆదివారం అతని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మిత్రుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో అతని క్లాస్ మేట్స్ గడ్డం నర్సింలు, భూపతి రెడ్డి, పృథ్వీ రాజ్, ఆంజనేయులు, ఉప్పు మల్లయ్య, రాజేందర్, సంజీవరెడ్డి, బాల్ నర్సాగౌడ్, విశ్వనాథం, క్రిష్ణ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వోడపల్లి నర్సింగరావు గారు చుక్కాపూర్ వాస్తవ్యులు ఇటవీల మరణించారు. అతనితో చుక్కాపూర్ లో హై స్కూల్ వరకు చదువుకున్న బాల్యమిత్రులు వారి కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది.