బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు మల్లాని ప్రమోద్ (32) శనివారం మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి దహన సంస్కారాలకు మృతుడి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరు స్వామి అనిల్ పాల్గొన్నారు.