మహిళా సంఘాలకు రూ.8.13 కోట్ల ఆర్థిక సాయం పంపిణీ
బాన్సువాడ, బతుకమ్మ : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెప్మా, ఎస్ఈఆర్ పి ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల సందర్భంగా బాన్సువాడ పట్టణం, గ్రామీణ మండలంలోని గ్రామ సంఘాలు, వార్డు సంఘాల అధ్యక్షులు, వీవోఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో దోమకొండ, బాన్సువాడ మండలాలకు...