అధ్విత చేయూత ఫౌండేషన్ ఆర్ధిక సహాయం

వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని  టికై బాలేష్ కుమార్తె అద్విత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండటం తెలుసుకొన్న చేయూత ఫౌండేషన్ భాదితురాలికి చేయూతనందించారు. శనివారం  చేయూత సభ్యులు అధ్విత చికిత్స కోసం తమ వంతుగా రూ. 10 వేల నగదును తండ్రికి  అందజేశారు.ఆర్ధిక సహాయం అందించిన చేయూత సభ్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.