ఐఐటీ విద్యార్థికి ఆర్థిక సాయం
బతుకమ్మ, కోటగిరి : జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచి ఐఐటీలో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి శ్రీ వేద హై స్కూల్ యాజమాన్యం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్సై సునీల్ చేతుల మీదుగా ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఐఐటీలో జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. దేశంలో కేవలం 17 ఐఐటి కళాశాలలు ఉండగా గ్రామీణ ప్రాంతానికి చెందిన మమత సీటు...