బతుకమ్మ, కోటగిరి : జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచి ఐఐటీలో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి శ్రీ వేద హై స్కూల్ యాజమాన్యం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్సై సునీల్ చేతుల మీదుగా ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఐఐటీలో జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. దేశంలో కేవలం 17 ఐఐటి కళాశాలలు ఉండగా గ్రామీణ ప్రాంతానికి చెందిన మమత సీటు సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఆమెకు నాణ్యమైన విద్యను అందించిన శ్రీ వేద పాఠశాల యాజమాన్యం ను ఆయన అభినందించారు. కోటగిరి ఉమ్మడి మండలాలలో ఇప్పటివరకు ఐఐటీ సీటు సాధించిన విద్యార్థులు లేకపోవడం శ్రీ వేద విద్యార్థినికి సీటు దొరకడం ప్రశంసనీయమన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు గురువులకు గౌరవం తెచ్చేలా ఉండాలని ఆయన సూచించారు. రాబోయే రోజులలో ఐఐటి విద్యను పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామానికి ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా మమత కృషి చేయాలని ఆయన కోరారు. ఐఐటీ సీటు వచ్చేలా పాఠశాల స్థాయి నుంచి విద్యను అందించిన శ్రీ వేద ఉపాధ్యాయ బృందాన్ని యాజమాన్యంను అభినందించారు. ధరావత్ మమతను శాలువా మెమొంటోద్దు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర, మమత, తల్లిదండ్రులు మిట్యా నాయక్, శాంతాబాయిలను ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సాయి, పవన్, రమేష్, భీమ్రావు, మహేష్, గంగాధర్, నఫీజ్, చంద్రకళ, సంగీత, సురేఖ, గంగాసాగరి తదితరులు పాల్గొన్నారు.