Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 4:30 pm Posted by : ramakrishna

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

ముప్కాల్, బతుకమ్మ: ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన వడ్ల రాములు(బాలయ్య) అనారోగ్యంతో మరణించారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు సమాచారం అందించగా ఆయన స్పందించి అంత్యక్రియల కొరకు రూ.5000 ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాములు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.