బతుకమ్మ, మోర్తాడ్: మండలం ధర్మోర గ్రామానికి చెందిన కొండం సాగర్ ఇటీవల గుండెపోటు తో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారిది పేద కుటుంబం కావడంతో వారికి రూ. 10,000 ఆర్థికసాయం అందజేశారు. ఆ ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబానికి గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మిట్టపల్లి దేవేందర్, మహేష్, అనిల్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.