Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 6:11 pm Posted by : ramakrishna

దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ దివంగత బెజ్జరపు పావని కుటుంబ సభ్యులను మెండోర మండల సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఫోరం నాయకులు, మెండోర మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పావని కుమారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు వేల్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెండోర మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వేల్పూర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుట్టడి ప్రమోద్ కుమార్, బుస్సాపూర్ సర్పంచ్ నూతపల్లి శ్రీనివాస్, నడిమిడి తండా సర్పంచ్ రవి నాయక్, పోచంపాడ్ సర్పంచ్ రాజు, దూద్గం సర్పంచ్ బాబా, వెల్కటూర్ సర్పంచ్ కావ్య సతీష్, సోన్‌పేట్ సర్పంచ్ నర్సవ్వ మల్కేష్, చాకిర్యాల్ సర్పంచ్ బద్రి శ్రీనివాస్, నెహ్రూ నగర్ సర్పంచ్ డాబాడి ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.