ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం
లింగంపేట, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేద యువకుడికి హైకోర్టు న్యాయవాది ఆర్థిక సాయం అందించి ఉదారత చాటుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట గ్రామానికి చెందిన లంబడి శ్రీనివాస్ (చిన్న) గత నెలలో రాత్రి సమయంలో గోపాల్‌పేట నుంచి ద్వి చక్రవాహనంపై వస్తున్నారు. మార్గమధ్యలో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలపై కప్పిన నల్లటి టార్పాలిన్ కవరు చీకటిలో కనిపించక పోవడంతో వాహనం అదుపు తప్పి దానిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో...