- మూడు ప్రాజెక్టులకు రూ.13 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఫలించిన ఎంపీ అర్వింద్ మంత్రాంగం
- హర్షం వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లు
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అడవి మామిడి పల్లి ఆర్ఓబి కు రూ.3.20 కోట్లు, అర్సపల్లి ఆర్ఓబి కు రూ.4.7 కోట్లు, మాదవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జీ పనులకు సుమారు రూ.6 కోట్ల నిధులను విడుదల చేస్తు కొత్త సంవత్సరం వేళ ఇందూర్ జిల్లా కు శుభవార్త చెప్పింది. ఈ నెల 22న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీ బేషజాలను పక్కన పెట్టి స్వయంగా సీయం రేవంత్ రెడ్డిని కలిసి జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు విడుధల చేయాలని కోరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని ఎంపీ అరవింద్ కలిసిన వారం రోజులలోనే నిధులు విడుదల కావడంతో రైల్వే పనుల సాగదీతకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని రైల్వే కాంట్రాక్టర్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే పనుల విషయం ఒక్క పర్సంటేజ్ కమీషన్ ఆశించకుండా ఎంపీ అరవింధ్ నిధులు ఇప్పించేందుకు సైతం చొరవ చూపడంతో నిధుల విడుదల సాధ్యమైందంటున్నారు కాంట్రాక్టర్ లు..

నిజామాబాద్ జిల్లాలోని అడవి మామిడి పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జీ నిర్మాణం మొత్తం రైల్వే నిధులతో, మాదవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా, అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జీ కేంద్ర నిధులతో జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వం హయాంలోనే అడవి మామిడిపల్లి బ్రిడ్జి పనులు తాలుకు డబ్బులను కేంద్రం విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లించింది. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు అధికారుల ద్వార గుర్తించి ప్రభుత్వ నిధుల కోసం పోరాటం చేశారు. దిశ సమావేశాలతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితోను ఢీ అంటే ఢీ అన్నారు. ఐతే నాటి ప్రభుత్వం నిధుల విడుదలలో చొరవ చూపకపొవడంతో పనులు నత్త నడకన నడుస్తున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వగా వాటిని దారి మళ్లించిన ప్రభుత్వం ఎంపీ అర్వింద్ కు క్రెడిట్ దక్కవద్దని నిధుల విడుదలలో తాత్సారం చేస్తు వస్తోందనే విమర్శలను మూట గట్టుకుంది. ఇటీవల రాష్ట్రం లో ప్రభుత్వం మారిన తరువాత తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిధుల, డెవలప్ మెంట్ విషయంలో వరుసగా కేంద్రమంత్రులను కలిసి అధిక నిధుల కోసం ఒత్తిడి తెచ్చారు ఎంపీ అరవింద్. అదే సమయంలో జిల్లాలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించి సమీక్షించిన రైల్వే పనులకు నిధులు విడుదల కాలేదు. కానీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వయంగా సీయం రేవంత్ రెడ్డిని కలువగా సోమవారం వరకు నిధులు విడుదల చేస్తామని సీయం రేవంత్ రెడ్డి హమీ ఇచ్చినట్లు సమాచారం. సీయం చెప్పినట్లుగా మూడు రైల్వే ప్రాజెక్టులకు రూ.13 కోట్లకు పైగా నిధులు రావడంతో ఎంపీ అర్వింద్ మంత్రాంగం ఫలించినట్లయింది. రెండు సంవత్సరాలుగా రైల్వే ప్రాజెక్టులకు స్టేట్ నిధులు రావడంలో తాత్సారం జరుగుతున్న సమయంలో నిధులు రావడంతో ఇక రైల్వే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిస్తామని నిధులు విడుదల చేసిన సీయం రేవంత్ రెడ్డికి, అందుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు కాంట్రాక్టర్ లు ధన్యవాదాలు తెలపడం గమనార్హం.
