Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 3:18 pm Posted by : ramakrishna

సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా

  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం  సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో   జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్,  పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల పరిధిలో 260 గ్రామ పంచాయతీ లలోని 2268 వార్డులలో 3,52,134 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న విడుదల చేసి గ్రామపంచాయతీ కార్యాలయాలలో అంటించడం జరిగిందని అన్నారు.జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా  తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 లోపు తెలియజేయాలని , ఆగస్టు 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు.ప్రతి మండలం పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  2268  డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ఎంపీడీవో  ఆగస్టు 28న తయారు చేశారని, వీటిపై అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు  ఎంపిడిఓ కార్యాలయంలో అందించాలని అన్నారు. సెప్టెంబర్ 2న తుది పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేయడం జరుగుతుందని అన్నారు.600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేస్తున్నామని ,జిల్లా లో ఎక్కడైనా అదనపు పోలింగ్ కేంద్రం అవసరమంటే వివరాలు అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో  జిల్లా పంచాయతీ అధికారి షరీపుద్దిన్, డివిజనల్ పంచాయతీ అధికారి నరేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.