ప్రశాంతంగా ప్రారంభమైన తుది విడత పోలింగ్

నిజామాబాద్, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లాలో మూడో (తుది) విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. చలి ప్రభావాన్ని లెక్క చేయకుండా ఓటర్లు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఉదయం 9 గంటల సమయానికే 23.35 శాతం సగటు పోలింగ్ నమోదైంది.  జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బాల్కొండ, అంకాపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును,...