అసైన్డ్ భూమి వెంచర్ కు ఫైనల్ లే అవుట్ పర్మిషనా..?

ముప్కాల్ లో మాజీ ప్రజాప్రతినిధి హవా మొదటి నుంచి వివాదాలున్నా పట్టించుకోని అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకులు   బాల్కొండ, బతుకమ్మ: ముప్కాల్ మండల కేంద్రంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన వెంచర్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారింది. వెంచర్ అనుమతుల కోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్న సదరు మాజీ ప్రజాప్రతినిధి చివరకు తాను అనుకున్నది సాధించాడు. మొత్తం 2.5 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న సదరు వ్యక్తి డీటీసీపీ అనుమతి కోసం ఎత్తుగడ...