Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 7:34 pm Posted by : ramakrishna

భువన ఆర్ట్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ పాట చిత్రీకరణ

  • గ్రామస్తులను అలరించిన తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయ నృత్యాలు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ లో భువన ఆర్ట్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగల సందర్భంగా బతుకమ్మ పాట చిత్రీకరణ  ప్రముఖ కోరియోగ్రాఫర్ ఉమేష్,తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ లు ప్రారంభించారు. పాట చిత్రీకరణ లో భాగంగా ముందుగా పెద్దబడి లో గల సరస్వతి విగ్రహానికి, శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ అర్చకులు బిట్కూరి నవీన్ ఆచారి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగాఎంపీడీఓ సత్తయ్య, మండల విద్యాధికారి కృష్ణ హరి లు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ మహిళలకు అతిపెద్ద పూల పండగ అని అన్నారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ  బతుకమ్మ నృత్యాలను చేశారు. అనంతరం బతుకమ్మ లను ఎల్లారెడ్దిపేట లోనీ  గిద్దె చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్ది,జై గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు పందిర్ల లింగం గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి గంట వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,రెడ్ది సంఘం మండల అధ్యక్షులు గుండాడీ వెంకట్ రెడ్ది, మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మేగీ మంజుల, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు ముత్యాల శ్రీనివాస్ రెడ్ది, గరుగుల స్వామి, పాఠశాలలోని ఉపాధ్యాయనీ ఉపాద్యాయులు ,విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.