Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:26 pm Posted by : ramakrishna

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సినీ హిరో నాని

 

ములుగు, బతుకమ్మ :

 

మలుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క సారలమ్మను సినీ హిరో నాని దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన నాని చిత్రం ప్యారడైజ్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ డైరెక్టర్ శ్రీకాంత్  ఓదెల, హిరో సంపూర్ణేష్ బాబుతో కలిసి  హిరో నాని మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవార్లకు దర్శనం చేసుకున్న అనంతరం హిరో నాని తులాభారం వేయించుకున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యన ఉన్న గట్టమ్మ దేవాలయం వద్ద ఆగి అమ్మవారిని దర్శించుకున్నారు.

Film actor Nani visited the Sammakka-Saralamma shrine.