Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 7:46 pm Posted by : ramakrishna

మార్చి 10లోపు నామినేటెడ్ పదవుల భర్తీ

పార్టీ కోసం కష్టపడ్డవారికి తప్పకుండా గుర్తింపు

ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవద్దు

సీఎం రేవంత్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ : మార్చి 10లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవద్దన్నారు. దేశంలోనే అత్యధిక పన్నులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బీహార్ కు మాత్రమే ఇస్తోందన్నారు. మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో ఊదాలంటే పార్టీ నేతలు వ్యతిరేక దిశలో చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కిషన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి  ప్రాజెక్టులు రావడం లేదు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్ల  రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మెట్రో, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులను ఆయన అడ్డుకుంటున్నారని వ్యాఖ్యనించారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేస్తున్నారని విమర్శించారు.

 Filling up of nominated posts by March 10