అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.   నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నామన్నారు. కార్వాన్ లో పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.  కులగణన సరిగ్గా జరగలేదని అనేక మంది ఫిర్యాదులు చేశారన్నారు.  తమ వివరాలు సేకరించలేదని లక్షలాది కుటుంబాలు చెబుతున్నాయన్నారు. కులగణన వివరాలను గ్రామాల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం...