Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 8:59 pm Posted by : ramakrishna

ఓజెటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన 

భీమ్ గల్, బతుకమ్మ :  ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో ట్రైన్ అవుతున్న భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లోని ఫిషరీష్ విద్యార్థులు మంగళవారం క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా మండలంలోని మెండోరా ఊర చెరువును సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులు చెరువులో పెంచుతున్న మంచినీటి చేపల పెంపకం గురించి తెలుసుకొన్నారు.చేపలు  పెంపకం, చేపలు పట్టడం, నీటిలో పడవలు వాడకం, వలల వాడకం తదితర అంశాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.ఈ ఊర చెరువులో కాళ్ళుకట్ల,రోహు,బంగారు తీగ,గ్రాస్ కార్ప్ జాతుల చేపలు పెంచుతున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు విద్యార్థులకు తెలిపారు.ఈ సందర్బంగా విద్యార్థులు నీటి నాణ్యత, నీటిలో పెరిగితున్న ప్లవక జీవులు, వాటి ఉపయోగాలను గురించి తెలుసుకొని ప్రత్యేక్షంగా చూసి వాటితో పాఠ్యంశ విషయాలను అవగతం చేసుకొన్నారు.ఈ ఓ జె టి విద్యార్థుల వెంట అధ్యాపకులు శ్రీనివాస్ ఉన్నారు.