Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 4:58 pm Posted by : ramakrishna

సోయా పంట పై రైతులకు క్షేత్ర శిక్షణ

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని రైతు వేదికలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిఎస్బి 34 రకం సోయాబీన్ విత్తనాలు రైతులకు సరఫరా చేశారు. అందించిన విత్తనాలపై మంగళవారం క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతులు పై పరిశోధన వేత్త అనిల్ రెడ్డి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించారు. సోయాబీన్ వేసిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పొగాకు  లద్దె పురుగు, యెల్లో మోసాయిక్ వైరస్ గమనించి తగు నివారణ చర్యలు చెప్పారు.  పరిశోధన వేత్త రేవన్, ఏవో రాజు, ఎఫ్ పి ఓ చైర్మన్ చట్లవర్ గోపాల్, ఏఈ వో విశాల్ గౌడ్, కుశల్, గంగారాం, భీంరావు, గోపాల్, నగనాథ్, సాయిబాబా, సురేష్, బస్వంత్ రైతులు  పాల్గొన్నారు.

Field training for farmers on soybean cultivation