20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి
నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ, ముప్కాల్, ఆర్మూర్ మండలాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ముప్కాల్ మండలం నాగంపేట్, బాల్కొండ మండలం జలాల్పూర్, ఆర్మూర్ మండలం ఫత్తేపూర్...