Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 4:28 pm Posted by : ramakrishna

తహసీల్దార్ కు క్షేత్ర సహాయకుల వినతి పత్రం అందజేత

బతుకమ్మ,మెండోరా: న్యాయమైన డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిష్కరించి క్షేత్ర సహాయకులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం మెండోరా తాసిల్ ల్దార్ సంతోష్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఉపాధి హామీ హక్కుదారులైన కూలీలకు రోజుకు వేతనం రూ. 400 పెంచుతూ ఒక ఆర్థిక సంవత్సరంలో 150 రోజుల పని దినాలు కల్పించాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా పెండింగ్ లో  ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని అన్నారు. ఉపాధి హామీలు పనిచేస్తున్న అన్ని స్థాయి ఉద్యోగులు మాదిరిగానే క్షేత్ర సహాయకులకు కూడా ఎఫ్ టి ఈ లుగా కన్వర్ట్ చేసి కనీస వేతనం రూ. 25000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డులు ఇచ్చి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. 4779 సర్క్యులర్ ను రద్దుచేసి లిస్ట్ మూడు కింద తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మెండోరా మండల క్షేత్ర సహాయకుల అధ్యక్షుడు శేఖర్,  ఉపాధ్యక్షుడు జోగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.