Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 11:20 pm Posted by : ramakrishna

పండగల బాబా సాహెబ్ జయంతి వేడుకలు

  • ఊరురా డప్పుల దరువులు, అన్నదానాలు

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలల్లో డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సందర్బంగా పండగ వాతావరణం నెలకొంది. బాబా సాహెబ్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని పురవీధుల్లో డప్పులతో ర్యాలీని నిర్వహించి బడా భీమ్ గల్ చౌరస్తా వద్ద గల బాబా సాహెబ్ విగ్రహానికి పుర ప్రముఖులు, అంబేద్కర్ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం రక్త దాన శిభిరం ఏర్పాటు చేసి రక్తధానం చేశారు. ఇందులో భాగంగా స్థానిక ఎస్సై మహేష్ రక్త దానం చేశారు. తధానంతరం అన్నధాన కార్యక్రమంను నిర్వహించారు. మండలంలోని గ్రామ గ్రామాన బాబా సాహెబ్ ను స్మరించుకొంటూ ర్యాలీలను నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించి, అన్నధాన కార్యక్రమాలు నిర్వహించారు.

Festive Babasaheb Jayanti celebrations