Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 5:34 pm Posted by : ramakrishna

ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి 

 బతుకమ్మ, బోధన్: బోధన్ టిటిడి కళ్యాణ మండపంలో ఏసీపీ శ్రీనివాస్ ,టౌన్ సిఐ వెంకట నారాయణ,రూరల్ సిఐ విజయ్ బాబు సంయుక్తంగా శ్రీ రామనవమి పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఏప్రిల్ 6న  జరగబోహే రామునికల్యాణన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవలని ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు చూడలని సన్నాయి చప్పుడ్లు తప్ప డిజెలు పెట్టారదని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. బోధన్ పట్టణంలో శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవలని ఆకతాయిలు ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీస్ దృష్టితీసుకురాలని సిఐ వెంకట నారాయణ కోరారు. రూరల్ సిఐ మాట్లాడుతూ పండగలను ప్రజలు,భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని విజయవంతం చెయ్యలాన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ శక్కర్ నగర్,ఎడపల్లి,రెంజల్ మండలాల శ్రీరామనవమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Festivals should be celebrated peacefully.